స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఆరంభం సెషన్లో లాభాల దిశగా అడుగులు వేసిన సూచీలు క్రమక్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 465 పాయింట్ల క్షీణించి 48,253 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయి 14,496 వద్ద ముగిసింది.
స్థానిక లాక్డౌన్ల కారణంగా దేశంలో నిరుద్యోగం పెరగడం, ఏప్రిల్ నెలలో తయారీ రంగం పీఎంఐ 8 నెలల కనిష్ఠానికి చేరుకోవడం లాంటి వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమ్మకాలు భారీగా పెరిగాయి.
ఇంట్రాడే సాగిందిలా..