ఒడుదొడుకుల సెషన్‌ను (మంగళవారం) చివరకు ఫ్లాట్‌గా ముగించాయి స్టాక్ మార్కెట్లు (Stocks Today). బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 17 పాయింట్లు తగ్గి 58,279వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 16 పాయింట్ల నష్టంతో 17,362 వద్ద ముగిసింది.
వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,553 పాయింట్ల అత్యధిక స్థాయి (నూతన రికార్డు), 58,005 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,436 పాయింట్ల గరిష్ఠ స్థాయి (జీవనకాల గరిష్ఠం), 17,287 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..