ఒడుదొడుకుల మధ్య దేశీయ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 52,344వద్ద స్థిరపడింది, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో15,683కు చేరింది. లోహ, ఆటో, ఐటీ, బ్యాంకు రంగ షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొగా.. ఫార్మా, ఎఫ్ఎమ్సీజీ షేర్ల కొనుగోలుకు మదుపరులు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆద్యంతం నష్టోల్లోనే ఉన్న సూచీలు.. తేరుకుని లాభాల్లోకి వచ్చాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,586 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 51,601 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.