తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లపై బేర్​ పంజా.. సెన్సెక్స్​ 1000 పాయింట్లు డౌన్​

stock market crash today: దేశీయ మార్కెట్లపై బేర్​ పంజా విసిరింది. ఒమిక్రాన్​ భయాలకు అంతర్జాతీయ ప్రతికూలతలు తోడవడం వల్ల బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. సోమవారం సెషన్​ను భారీ నష్టాలతో ప్రారంభించాయి.

By

Published : Dec 20, 2021, 9:51 AM IST

Updated : Dec 20, 2021, 11:20 AM IST

stock-market-crash-today-india
సెన్సెక్స్​ 1000 పాయింట్లు డౌన్​

stock market crash today: ఒమిక్రాన్​ భయాలతో పాటు అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో చవిచూస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1061 పాయింట్ల నష్టంతో 55,951 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 313 పాయింట్ల నష్టంతో 16,672 వద్ద ట్రేడ్​ అవుతోంది.

56,517 వద్ద ప్రారంభమైన బీఎస్​ఈ సెన్సెక్స్​.. 56,538కు చేరి ఆ వెంటనే మరింత నష్టాల్లోకి జారుకుంది. నిఫ్టీ 50.. 16,824 పాయింట్ల వద్ద ప్రారంభమై.. నష్టాల్లో ట్రేడ్​ అవుతోంది.

కారణాలు..

  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. వీటిపై ఆందోళనకర వార్తలు బయటకొస్తున్నాయి. భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. దీంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ప్రస్తుతం షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. ఫలితంగా దేశీయ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
  • దేశీయ మార్కెట్లలో.. గత కొంతకాలంగా విదేశీ మదుపర్లు అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్నారు.
  • కేంద్ర ఆర్థిక శాఖ వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయాబీన్స్‌, ముడి పామాయిల్‌, పెసర్ల కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని సెబీని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మార్కెట్లపై ప్రతికూలంగా పడింది.

15 నినిషాల్లో రూ. 5.19లక్షల కోట్లు...

ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో బీఎసీఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.19లక్షల కోట్లు తగ్గి రూ.254.08లక్షల కోట్లకు పడిపోయింది.

లాభనష్టాల్లోనివి..

బజాజ్​ ఫినాన్స్​, ఎస్​బీఐ, ఎమ్​ అండ్​ ఎమ్​, టాటా స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్​లో ఒక్క షేరు కూడా లాభాల్లో లేదు.

నిపుణుల మాట...

అంతర్జాతీయంగా ఒమిక్రాన్​పై ఆందోళనలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే దాని ప్రభావం తీవ్రంగా లేదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పవనాలు ఎక్కువ కాలం ఉండవని, షేర్లు భారీగా పడితే విదేశీ మదుపర్లు కొనుగోళ్లు చేస్తారని చెబుతున్నారు.

Last Updated : Dec 20, 2021, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details