తెలంగాణ

telangana

ETV Bharat / business

వీడని యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్లకు నష్టాలు - సెన్సెక్స్​

stock market closing today: దేశీయ స్టాక్​ మార్కెట్లను రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 149 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించింది.

stock market
స్టాక్​ మార్కెట్​

By

Published : Feb 21, 2022, 3:41 PM IST

stock market closing today: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్​ మినహా.. క్యాపిటల్​ గూడ్స్​, ఎఫ్​ఎంసీజీ, మెటల్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ఫార్మా రంగాలు 1 శాతం మేర నష్టపోయాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి.

  • బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 149 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో.. సెన్సెక్స్​ దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 57,551 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 57,167 పాయింట్ల కనిష్ఠ, 58,141 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 57,684 పాయింట్ల వద్ద స్థిరపడింది.

  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 17,207 పాయింట్ల వద్ద స్థిరపడింది

లాభనష్టాల్లోనివి...

పవర్​ గ్రిడ్​, శ్రీ సిమెంట్​, ఇన్ఫోసిస్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​ లాభాలతో ముగిశాయి.

కోల్​ ఇండియా, హిందాల్కో 3 శాతానికిపైగా నష్టపోయాయి. యూపీఎల్​, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా 2.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:

OpenSea NFT: 1.7 మి.డాలర్ల ఎన్‌ఎఫ్‌టీలు దొంగిలించిన హ్యాకర్లు

ABOUT THE AUTHOR

...view details