స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 257 పాయింట్లు బలపడి 51,039వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 115 పాయింట్లకుపైగా పెరిగి 15,097వద్దకు చేరింది.
అంతర్జాతీయ పరిణామాలు, ఫిబ్రవరి డెరివేటీవ్స్ ముగింపు వంటి కారణాలతో సూచీలు లాభాలను ఆర్జించాయి. మరో వైపు బ్యాంకింగ్ షేర్లు దూకుడు, విదేశీ పెట్టుబడులు మార్కెట్కు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,386 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,991 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.