Stock Market Close:అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు మీదున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 657 పాయింట్లు పెరిగి 58 వేల 466 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ దాదాపు 350కుపైగా పాయింట్ల లాభంతో సెషన్‌ను ప్రారంభించి.. ఎక్కడా తగ్గలేదు. ఇంట్రాడేలో దాదాపు 700 పాయింట్ల లాభంతో.. 58 వేల 508 వద్ద గరిష్ఠాన్ని తాకింది. సెషన్ కనిష్ఠం 58,105 పాయింట్లు.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో 17 వేల 464 వద్ద సెషన్‌ను ముగించింది.
ఐటీ, ఆర్థిక షేర్లు పుంజుకోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. ఆటో, లోహ, ప్రైవేటు బ్యాంకింగ్ రంగం షేర్లు 1-2 శాతం మేర లాభపడ్డాయి.