Stock Market Update: ఆద్యంతం ఊగిసలాడిన స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణుల నుంచి మిశ్రమ సంకేతాలతో ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 91 పాయింట్ల నష్టం పోయి.. 57,806 వద్ద స్థరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ.. 20 పాయింట్లు కోల్పోయి.. 17,213 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
ఉదయం 57,892 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 58,097 పాయింట్ల అత్యధిక స్థాయిని చేరి.. ఒకదశలో 57,684 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 17,286 పాయింట్ల గరిష్ఠ స్థాయి.. 17,176 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.