తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్ 296 పాయింట్లు ప్లస్ - స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 296 పాయింట్లు పెరిగింది. మరో సూచీ నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి చెందింది.

Stock Market
Stock Market

By

Published : Dec 27, 2021, 3:48 PM IST

Stock Market: స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగి.. చివరకు లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 296 పాయింట్లు లాభపడి.. 57,420 వద్ద స్థిరపడింది. మరో సూచీ జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజ్​-నిఫ్టీ 82 పాయింట్లు వృద్ధి చెంది.. 17,086 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మళ్లీ ఆంక్షలు తప్పవన్న భయాల నడుమ ఉదయం 56,948 వద్ద 575 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది సెన్సెక్స్​. ఇంట్రాడేలో 56,543 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత కాసేపటికే పుంజుకుని.. 57,512 వద్ద గరిష్ఠస్థాయికి చేరింది.

నిఫ్టీ.. ఇంట్రాడేలో 16,833 వద్ద అత్యల్పస్థాయికి చేరి.. తిరిగి పుంజుకుని 17,112 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

లాభనష్ఠాలు

  • టెక్​మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్​, పవర్​గ్రిడ్​, కొటక్​ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ఎక్కువగా లాభాలు గడించాయి.
  • ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, మారుతి, రిలయన్స్​, భారతీఎయిర్​టెల్​ షేర్లు ప్రధానంగా నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:ఆ డౌట్స్​తో ఆర్​బీఎల్​ షేర్లు పతనం.. భయం వద్దని ఆర్​బీఐ భరోసా

ABOUT THE AUTHOR

...view details