తెలంగాణ

telangana

ETV Bharat / business

బుల్ జోరు... సెన్సెక్స్​ 1000 ప్లస్​ - స్టాక్​ మార్కెట్​

Stock Market closing: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1040 పాయింట్లకు పైగా వృద్ధి చెందగా.. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకింది.

STOCK MARKET CLOSING NEWS
స్టాక్​మార్కెట్​

By

Published : Mar 16, 2022, 3:44 PM IST

Stock Market closing: దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 1040 పాయింట్లకు పైగా ఎగబాకి 56,817 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ కూడా 312 పాయింట్లు వృద్ధి చెంది 16,975 వద్ద ట్రేడింగ్ ముగించింది.

మొదటి నుంచి లాభాల్లో ప్రారంభం అయిన సూచీలకు ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు దన్నుగా నిలిచాయి. ఈ రోజు రాత్రి వెలువడనున్న అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు, చమురు ధరల కదలికలు, చైనాలో లాక్‌డౌన్‌లపై మదుపర్లు దృష్టి సారించారు. దీనికి తోడు నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతేగాకుండా అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో మన సూచీలు భారీ లాభాల దిశగా అడుగులు వేశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 56,860 పాయింట్ల అత్యధిక స్థాయి, 56,389 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 16,988 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,838 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభానష్టాలు..

ముప్పై షేర్ల ఇండెక్స్​లో కేవలం సన్​ఫార్మా మాత్రమే నష్టాలను మూటగట్టుకుంది.

కాస్తా కోలుకున్న పేటీఎం..

ఆర్​బీఐ ఆంక్షలతో భారీగా నష్టపోయిన పేటీఎం షేర్లు నేడు జీవన కాల కనిష్ఠానికి కుంగింది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో ఇవాళ పేటీఎం షేరు ఆరు శాతానికి పైగా కోలుకుంది.

ఇదీ చూడండి:

భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు.. కిలోలీటర్​ రూ.లక్ష పైనే..

ABOUT THE AUTHOR

...view details