stock market closing news: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి 55,550 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 16,630 వద్ద ముగిసింది.
ఉక్రెయిన్-రష్యా అనిశ్చితిలోనూ గత మూడు రోజులు రాణించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా.. సూచీలు ఆరంభంలో నష్టపోయినా సరే.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే లాభాల్లోకి చేరుకున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. అక్కడ ద్రవ్యోల్బణం తాజాగా గరిష్ఠాలకు చేరింది. గత ఏడాది కాలంలో గ్యాస్, ఆహారం, గృహాల ధరలు దూసుకెళ్లడంతో వినియోగదారు ద్రవ్యోల్బణం 7.9 శాతానికి చేరింది. 1982 తర్వాత ఇదే ఎక్కువ ద్రవ్యోల్బణం కావడం గమనార్హం. దీంతో అక్కడి మార్కెట్లు నష్టాల్ని చవిచూశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్ సూచీలు నేడు నష్టాల బాట పట్టాయి. ఈ క్రమంలోనే భారతీయ సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అయితే చమురు ధరలు తాజా గరిష్ఠాల నుంచి వెనక్కి రావడం సూచీలకు కాస్త కలిసొచ్చింది.
ఫార్మా స్టాక్స్ రాణించాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 55,834 పాయింట్ల అత్యధిక స్థాయి: 55,050 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,694 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,470 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.