తెలంగాణ

telangana

ETV Bharat / business

యుద్ధంపై వీడని అనిశ్చితి- మార్కెట్లకు మళ్లీ నష్టాలు - russia news

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. స్టాక్​ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 105, నిఫ్టీ 18 పాయింట్ల మేర పడిపోయాయి.

Stock Market Close, Stock Market Live Updates
Stock Market Close, Stock Market Live Updates

By

Published : Feb 17, 2022, 3:40 PM IST

Stock Market Close: రష్యా-ఉక్రెయిన్​ వివాదంపై అనిశ్చితి నెలకొన్న వేళ దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం కూడా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 105 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 892 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో.. 17 వేల 305 వద్ద సెషన్​ను ముగించింది.

మార్కెట్లు ఇవాళ్టి సెషన్​లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.

దాదాపు 200 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్​.. కాసేపటికే నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో 350 పాయింట్లకుపైగా కోల్పోయి 57 వేల 635 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని తాకింది. మళ్లీ పుంజుకొని 350 పాయింట్ల లాభంతో.. 58 వేల 346 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని చేరింది. గత సెషన్​ మాదిరిగానే ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. భారీ కుదుపునకు లోనయ్యాయి.

బ్యాంకింగ్​ షేర్లు దారుణంగా నిరాశపర్చాయి. ఒక శాతం మేర పడిపోయాయి. విద్యుత్తు రంగం షేర్లు రాణించాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ప్రతికూలంగా ట్రేడయ్యాయి.

లాభనష్టాల్లో ఇవే..

హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ లాభపడ్డాయి.

యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, యూపీఎల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ పతనమయ్యాయి.

ఇవీ చూడండి:Air India: 'ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎయిర్​ఇండియా'

It raid news: ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ ఇంట్లో ఐటీ సోదాలు​

ABOUT THE AUTHOR

...view details