తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగు వరుస సెషన్ల లాభాలకు బ్రేక్​- సెన్సెక్స్​ 621 మైనస్​ - stock market updates

Stock Market Close: స్టాక్​ మార్కెట్లపై మళ్లీ బేర్​ పంజా విసిరింది. సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పతనమై.. 60 వేల మార్కును కోల్పోయింది. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా క్షీణించింది. ఐటీ, రియల్టీ షేర్లు డీలాపడ్డాయి.

Stock Market Close
Stock Market Close

By

Published : Jan 6, 2022, 3:42 PM IST

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్లలో నాలుగు వరుస సెషన్ల లాభాలకు బ్రేక్​ పడింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు/బలహీన సంకేతాలు, హెవీ వెయిట్​ షేర్ల పతనం మార్కెట్లను దెబ్బతీశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 60 వేల మార్కును కోల్పోయింది. 621 పాయింట్లకుపైగా నష్టంతో.. 59 వేల 602 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 179 పాయింట్లు క్షీణించి.. 17 వేల 746 వద్ద సెషన్​ను ముగించింది.

Stock Market Closing Bell:

గురువారం సెషన్​లో సూచీలు ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. గత సెషన్​లో సెన్సెక్స్​ 60 వేల 223 వద్ద ముగియగా.. గురువారం 500 పాయింట్లకుపైగా నష్టంతో 59 వేల 730 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో ఏకంగా 950 పాయింట్లకుపైగా పతనమై.. 59 వేల 291 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇంట్రాడేలో సూచీలు మళ్లీ కాస్త కోలుకున్నాయి.

మొత్తం 1798 షేర్లు లాభపడ్డాయి. 1336 షేర్లు నష్టపోయాయి. 74 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

లాభనష్టాల్లోనివి ఇవే..

యూపీఎల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఐషర్​ మోటార్స్​, బజాజ్​ ఆటో, భారతీ ఎయిర్​టెల్​ రాణించాయి.

జేఎస్​డబ్ల్యూ స్టీల్​, శ్రీ సిమెంట్స్​, టెక్​ మహీంద్రా, అల్ట్రాటెక్​ సిమెంట్​, రిలయన్స్​ ఎక్కువగా నష్టపోయాయి.

ఇవీ చూడండి:'షావోమి' భారీ మోసం.. రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత

Work From Home: ఒమిక్రాన్​ భయాలు.. మళ్లీ వర్క్ ​ఫ్రమ్ హోం

ABOUT THE AUTHOR

...view details