Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో సెషన్లో నష్టాల్లోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు తగ్గి.. 57 వేల 232 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ తొలుత 300 పాయింట్లకుపైగా లాభంతో సెషన్‌ను ప్రారంభించింది. రోజంతా లాభాల్లోనే ఉన్నా.. మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 430 పాయింట్ల లాభంతో 57 వేల 733 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ 190 పాయింట్ల నష్టంతో 57 వేల 109 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 17 వేల 63 వద్ద సెషన్‌ను ముగించింది.
రియాల్టీ ఇండెక్స్ 3 శాతం మేర పుంజుకుంది. ఆటో, ఐటీ రంగం షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. చాలా వరకు నష్టాలు నమోదుచేశాయి.
Russia Ukaraine Crisis: రష్యా- ఉక్రెయిన్ వివాదం.. మార్కెట్ల వరుస నష్టాలకు కారణమవుతోంది.