తెలంగాణ

telangana

ETV Bharat / business

వెంటాడిన ఒమిక్రాన్​ భయాలు- మార్కెట్లకు నష్టాలు

Stock Market Today: మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 166 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 43 పాయింట్లు పైగా క్షీణించింది.

Stock Market Today
బీఎస్​ఈ సెన్సెక్స్​

By

Published : Dec 14, 2021, 3:45 PM IST

Share Market News Today: దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 166 పాయింట్లు కోల్పోయి 58,117 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 17,324 వద్ద స్థిరపడింది.

ఒమిక్రాన్‌ వ్యాప్తి.. విదేశీ సంస్థాగత మదుపరులను కలవరపరిచింది. మరోవైపు అమెరికాలో ఫెడ్‌ సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తతంగా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశపరచడం కారణంగా సూచీలు నేల చూపులు చూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 58,322 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,804 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,376 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,225 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

Stock Market Top Gainers: పవర్​ గ్రిడ్​, నెస్లే, డాక్టర్​ రెడ్డీస్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Stock Market Top Losers: ఐటీసీ, బజాజ్​ ఫినాన్స్​, కోటక్​ మహీంద్ర బ్యాంక్​, భారతీ ఎయిర్​ టెల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇదీ చూడండి:

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం- నవంబర్​లో 14.23 శాతం

ABOUT THE AUTHOR

...view details