Share Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సోమవారం సెషన్‌ను 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. ఒక దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని.. భారీ నష్టాలతో సెషన్‌ను ముగించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 58,283 వద్ద సెషన్‌ను ముగించింది. నిఫ్టీ 143 పాయింట్లు నష్టంతో 17,368 వద్ద స్థిరపడింది.
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా ఫెడ్ నిర్ణయాలు ఎలా ఉండనున్నాయనే ఆందోళన కూడా మదుపరుల్లో కనిపించింది. దీంతో అమ్మకాలకు ఎగబడ్డారు. ప్రధానంగా ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు భారీగా నష్టపోయాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 59,203 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,242 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.