కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు మరోమారు భారీ నష్టాలను చవిచూశాయి. దేశంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఓ దశలో హెవీ వెయిట్ షేర్ల దన్నుతో స్వల్ప లాభాల్లోకి వచ్చిన సూచీలు సెషన్ ముగింపునకు ముందు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 581 పాయింట్ల మేర నష్టపోయి 28, 288 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించింది. ఇంట్రాడేలో 7,900 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ.. కాస్త కొలుకుని 8,263 పాయింట్ల వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివి..