తెలంగాణ

telangana

ETV Bharat / business

వృద్ధిపై ఆందోళనలు- నష్టాల్లో సూచీలు

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలు వెలువడ్డాక కూడా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. కీలక వడ్డీ రేట్లను తగ్గించినా.. వృద్ధి అంచనాలు మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వృద్ధి మందగమనంపై భయాలతో కొనుగోళ్లు పెరగడం వల్ల మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి.

స్టాక్​మార్కెట్లు

By

Published : Jun 6, 2019, 1:42 PM IST

కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం వెలువరించిన తర్వాత కూడా స్టాక్​మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్చ్సేంజీ - సెన్సెక్స్ 338 పాయింట్లు నష్టపోయి 39,745 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ - నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయి 11,909 వద్ద కొనసాగుతోంది.

కారణమిదే..

కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినా.. మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయేందుకు ముఖ్య కారణం వృద్ధిపై నెలకొన్న ఆందోళనలేనని మార్కెట్​ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7.2 నుంచి 7 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 3-3.1శాతంగా, ద్వితీయ అర్ధ భాగంలో 3.4-3.7శాతం ఉండొచ్చని అంచనా వేసింది.

అందువల్ల రెపో రేటు 25 బేసిస్​ పాయింట్ల కోత ప్రస్తుతం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపలేకపోతోంది.

ఇదీ చూడండి : శుభవార్త: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్​బీఐ

నష్టాలు..లాభాలు

ఇండస్​ ఇండ్​ బ్యాంకు, యెస్​ బ్యాంకు, వేదాంత, ఎస్​బీఐ, ఎల్​అండ్​టీ, టాటా స్టీల్​, ఆర్​ఐఎల్​, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెడ్​డీఎఫ్​సీ షేర్లు 5శాతం వరకు నష్టపోయాయి.

ఏషియన్​ పెయింట్స్​, కోల్​ ఇండియా, హెచ్​యూఎల్, పవర్​గ్రిడ్​, హెట్​సీఎల్​ టెక్​, ఇన్ఫోసిస్​ షేర్లు 2శాతం వరకు లాభపడ్డాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details