తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ నిధుల ఉపసంహరణతో నష్టాల్లో మార్కెట్లు

విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగడం, బలహీన పారిశ్రామిక వృద్ధి డేటా ప్రభావంతో ఇవాళ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 227 పాయింట్లు కోల్పోయి 37 వేల 253 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11 వేల 48 వద్ద కొనసాగుతోంది.

విదేశీ నిధుల ఉపసంహరణతో నష్టాల్లో మార్కెట్లు

By

Published : Aug 1, 2019, 10:33 AM IST

బలహీన పారిశ్రామిక వృద్ధి డేటా, విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగింపు నేపథ్యంలో ఇవాళ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బీఎస్​ఈ సెన్సెక్స్ 227 పాయింట్లు కోల్పోయి 37 వేల 253 వద్ద కొనసాగుతోంది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 11 వేల 48 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

వేదాంత, టెక్ మహీంద్ర, ఎస్​ బ్యాంకు, టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్​గ్రిడ్, ఇండస్ఇండ్​ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ, హెచ్​సీఎల్​ టెక్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో

యూపీఎల్, హిందాల్కో, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, హెచ్​డీఎఫ్​సీ, రెడ్డీ ల్యాబ్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఫెడ్ రిజర్వ్​ వడ్డీ రేటు తగ్గింపు

అమెరికా ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీరేటును 25 శాతం తగ్గించింది. ఫలితంగా వడ్డీ రేట్ల శ్రేణి 2.0 - 2.25కు తగ్గింది.

రూపాయి విలువ

అమెరికా డాలరుతో పోల్చుకుంటే రూపాయి విలువ 32 పైసలు తగ్గి రూ.69.12 గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.70 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్​ ధర 65.17 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: 'ఆహారమే ఒక మతం'- జొమాటో పంచ్​ అదిరింది​

ABOUT THE AUTHOR

...view details