అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడడం ఖాయమన్న అంచనాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఐటీ, లోహ, ఆర్థిక రంగాల వాటాల కొనుగోళ్లతో సూచీలు లాభాల బాటలో దూసుకెళ్తున్నాయి.
ఓ దశలో 324 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 41 వేల 263 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ప్రస్తుతం దాదాపు 300 పాయింట్ల లాభంతో 41 వేల 230 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 80 పాయింట్ల వృద్ధితో 12 వేల 135 వద్ద కొనసాగుతోంది.