తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 590 ప్లస్ - nifty closing news

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 177 పాయింట్లు వృద్ధి చెందింది. సెన్సెక్స్ ముప్పై షేర్లలో మూడు మినహా అన్ని లాభాలు అందుకున్నాయి.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్లు

By

Published : Sep 28, 2020, 3:57 PM IST

Updated : Sep 28, 2020, 4:32 PM IST

స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలతో ఫైనాన్స్, ఆటోమొబైల్ షేర్లు జోరు సాగించాయి. ఫలితంగా బొంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 593 పాయింట్లు ఎగబాకింది. 37,756 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్.. ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ దశలో 38 వేల పాయింట్ల మార్క్​ను తాకిన సూచీ.. చివరకు 37,981 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల బాటలోనే పయనించింది. 177 పాయింట్ల లాభంతో 11,228 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్ ముప్పై షేర్లలో మూడు మినహా అన్ని షేర్లు లాభాలను అందుకున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 8 శాతం, బజాజ్ ఫైనాన్స్ 6 శాతానికిపైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ షేర్లు జోరు కనబర్చాయి.

ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్ సంస్థలు నష్టాలు మూటగట్టుకున్నాయి.

నిపుణుల మాట

ఆటోమొబైల్, పైనాన్స్​కు తోడు ఫార్మా షేర్లు రాణించడం.. సూచీల్లో జోష్ నింపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఎన్నికల డిబేట్​కు ముందు అంతర్జాతీయ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా కలిసొచ్చిందని పేర్కొన్నారు.

విదేశీ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు మిశ్రమంగా ఉంది. హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాలు నమోదు చేయగా.. షాంఘై సూచీలు నష్టపోయాయి. ఐరోపా స్టాక్ ఎక్స్ఛేంజీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

ముడిచమురు

అంతర్జాతీయంగా ముడిచమురు ధర 0.68 శాతం పడిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 42.12 డాలర్లుగా ఉంది.

రూపాయి

రూపాయి మారకం విలువ 18 పైసలు కోల్పోయింది. అమెరికన్ డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి విలువ 73.79గా ఉంది.

Last Updated : Sep 28, 2020, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details