కరోనా వల్ల వార్షిక జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదముందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రకటన చేసిన కాసేపటికే ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి స్టాక్‌మార్కెట్లు.
ఉదయం 11.30 గంటలకు 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయి 29,539 వద్ద ఉంది. నిఫ్టీ 9 వేల మార్కును కోల్పోయింది. 71 పాయింట్లు క్షీణించి 8,569 వద్ద నిలిచింది.
నష్టాల్లో...
30 షేర్ల బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ భారీగా నష్టపోయింది. సంస్థ షేర్లు 6 శాతం నష్టపోయాయి. హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో నష్టాల బాట పట్టాయి.
లాభాల్లో...
యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ లాభాల్లో ఉన్నాయి.