సెషన్ ఆఖరి అరగంటలో మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగగా.. స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ చివరకు 324 పాయింట్లు కోల్పోయింది. 38వేల 731వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 84 పాయింట్లు తగ్గి 11వేల 642వద్ద ముగిసింది.
ఇవీ కారణాలు...
*ముడి చమురు ధర 1.25శాతం పెరగడం
*రూపాయి బలహీనపడడం
*ఏప్రిల్ డెరివేటివ్‌ల కాంట్రాక్టు ముగింపు వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం
నష్టాల్లో...
టాటా స్టీల్, వేదాంత, మారుతీ, ఎస్బీఐ, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ డ్యుయో, ఐసీఐసీఐ బ్యాంకు, ఎమ్ అండ్ ఎమ్, కోటక్ బ్యాంకు, ఇన్ఫోసిస్ (సుమారు 2.89 శాతం) నష్టపోయాయి.