దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (సెన్సెక్స్) 232 పాయింట్లు లాభపడి 40,591 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు మెరుగై 11,985కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం దేశీయ మార్కెట్లకు కలిసివచ్చింది. లోహ, మౌలిక వసతులు, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ వంటి దిగ్గజ కంపెనీలు షేర్లు మార్కెట్లను పరుగులు పెట్టించాయి.
లాభనష్టాల్లో..