తెలంగాణ

telangana

ETV Bharat / business

కోలుకున్న మార్కెట్లు- సెన్సెక్స్​ రికార్డు రికవరీ - stock market news today

రికార్డు నష్టాల నుంచి అనూహ్యంగా కోలుకున్నాయి స్టాక్​ మార్కెట్లు. ఇంట్రాడేలో 5,200 పాయింట్లు రికవరీ చేసిన సెన్సెక్స్​.. 916 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 1,600 పాయింట్లకు పైగా పుంజుకుని 206 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

stock
స్టాక్

By

Published : Mar 13, 2020, 2:39 PM IST

కొన్ని రోజులుగా బేర్​ పట్టులో ఉండిపోయిన బుల్​.. ఒక్కసారిగా పరుగు అందుకుంది. రికార్డు నష్టాలతో నిలిచిపోయిన స్టాక్​ మార్కెట్లు.. పునఃప్రారంభం తర్వాత భారీగా పుంజుకున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్య లాభాల వైపు దూసుకెళుతున్నాయి.

రికార్డు రికవరీ..

ఒకానొక దశలో 3,500 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్​.. అనంతరం 5,200 పాయింట్లకుపైగా బలపడింది. ఇంట్రాడేలో అత్యధిక రికవరీ నమోదు చేసింది. ప్రస్తుతం 316 పాయింట్ల లాభంతో 33,694 పాయింట్లకు చేరుకుంది.

నిఫ్టీ కూడా 1,600 పాయింట్లు పుంజుకుని 10 వేల మార్కును దాటింది. ప్రస్తుతం 260 పాయింట్లు పెరిగి 9,850 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

ప్రారంభ సెషన్​లో నిఫ్టీ 10 శాతం, సెన్సెక్స్​ 9.43 శాతం నష్టపోయిన నేపథ్యంలో 45 నిమిషాల పాటు ట్రేడింగ్​ నిలిపివేశాయి స్టాక్ ఎక్స్ఛేంజీలు. అనంతరం ఉదయం 10.05 నిమిషాలకు పునఃప్రారంభమయిన తర్వాత కొంత అనిశ్చితి నెలకొన్నా తిరిగి భారీ లాభాలను సాధించాయి.

లాభనష్టాల్లో..

బ్యాంకింగ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఎస్బీఐ, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, భారతి ఎయిర్​టెల్​, బజాజ్​ ఫినాన్స్​ లాభాల్లో సాగుతున్నాయి.

హీరోమోటోకార్ప్​, ఏషియన్ పెయింట్స్​, మహీంద్ర అండ్ మహీంద్ర, నెస్లే, బజాజ్​ ఆటో నష్టాల్లో ఉన్నాయి.

'ఫియర్‌ గేజ్‌'గా పిలిచే అనిశ్చితి సూచీ కాస్త చల్లబడి భయాల్ని తొలగించింది. అయితే దీన్ని ఏమాత్రం సానుకూల పరిణామంగా పరిగణించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ అనిశ్చితి 'ఓవర్‌సోల్డ్‌ జోన్‌'లో ఉన్నట్లు సూచిస్తుందని ఆనంద్‌ రతీ సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుజన్‌ హజ్రా అభిప్రాయపడ్డారు. అందుకే కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించారు.

రూపాయి..

మార్కెట్లు కోలుకోవటం వల్ల రూపాయి కూడా బలపడింది. ఓ సమయంలో డాలరుతో మారకం విలువ రూ.74.50 వరకు పడిపోయిన రూపాయి.. ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమైన తర్వాత రూ. రూ.73.91 వరకు కోలుకుంది.

కరోనా ప్రభావంతో 1987 తర్వాత అమెరికా మార్కెట్లు భారీ స్థాయి పతనాన్ని నమోదు చేశాయి. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.

ABOUT THE AUTHOR

...view details