తెలంగాణ

telangana

ETV Bharat / business

వాణిజ్య చర్చల సఫలంపై ఆశలతో లాభాలు - రూపాయి విలువ

దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సఫలమవుతాయన్న ఆశలు, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలే ఇందుకు కారణం.

వాణిజ్య చర్చల సఫలంపై ఆశలతో లాభాలు

By

Published : Jul 30, 2019, 10:34 AM IST

Updated : Jul 30, 2019, 11:12 AM IST

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సూచనలు ఫలితంగా దేశీయ స్టాక్​మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వాహనరంగం, బ్యాంకింగ్​ షేర్ల భారీ కొనుగోళ్లతో ఈక్విటీ బెంచ్​మార్క్ బీఎస్​ఈ సెన్సెక్స్ 176.84 పాయింట్లు లాభపడి 37 వేల 863 వద్ద కొనసాగుతోంది. జాతీయ​ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 49 పాయింట్లు వృద్ధి చెంది 11 వేల 238 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో

టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్, ఎమ్​ అండ్ ఎమ్​, వేదాంత లిమిటెడ్, సన్​ఫార్మా, బజాజ్​ ఫైనాన్స్​, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్​, మారుతి (సుమారు 1.54 శాతం) లాభాలతో కొనసాగుతున్నాయి.​

నష్టాల్లో

హెచ్​యూఎల్​, ఐటీసీ, ఎన్​టీపీసీ, కోటక్​ బ్యాంకు, హీరో మోటోకార్ప్ (0.66 శాతం) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

సానుకూల పవనాలు

ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా-చైనాల మధ్య ఇవాళ వాణిజ్యచర్చలు పునఃప్రారంభమయ్యాయి. అయితే బుధవారం జరగనున్న యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ సమావేశానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండగా లాభాల జోరు పరిమితంగా ఉంది.

తగ్గిన రూపాయి విలువ

యూఎస్​ డాలర్​తో పోల్చితే రూపాయి విలువ 3 పైసలు తగ్గి రూ.68.78గా ఉంది.

పెరిగిన ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.42 శాతం పెరిగి, బ్యారెల్​ ధర 63.98 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: మాల్యా మరో షెల్ కంపెనీ గుట్టు రట్టు

Last Updated : Jul 30, 2019, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details