తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్ల​ కొత్త రికార్డ్​.. జీవనకాల గరిష్ఠానికి సెన్సెక్స్ - markets latest news

మార్కెట్ల​ కొత్త రికార్డ్​

By

Published : Nov 25, 2019, 2:12 PM IST

Updated : Nov 25, 2019, 3:49 PM IST

15:47 November 25

జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్​.. 12 వేల మార్క్​లో నిఫ్టీ

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. 529 పాయింట్ల లాభంతో 40,889 వద్ద ముగిసింది. 
జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 12 వేల మార్క్​ను చేరింది. 159 పాయింట్ల వృద్ధితో 12,073 వద్ద స్థిరపడింది.  

14:00 November 25

మార్కెట్ల​ కొత్త రికార్డ్​.. జీవనకాల గరిష్ఠానికి సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్ల లాభాల్లో కొనసాగుతుండటం, లోహ, మౌలిక వసతులు, ఐటీ రంగంలో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 487 పాయింట్ల లాభంతో 40,845 వద్ద కొనసాగుతోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 143 పాయింట్లు పుంజుకుని 12, 057 వద్ద ట్రేడవుతోంది. 

లాభనష్టాల్లోనివి...

భారతీ ఎయిర్​టెల్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, టాటాస్టీల్​, హిందల్కో, జేఎస్​డబ్ల్యూ స్టీల్​ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎస్​ బ్యాంక్​, జీ ఎంటర్​టైన్​మెంట్​, ఓఎన్​జీసీ, బీపీసీఎస్​, గెయిల్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Last Updated : Nov 25, 2019, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details