తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు లాభాలు తెచ్చిన ప్రత్యేక 'మూరత్​ ట్రేడింగ్​' - మార్కెట్లకు లాభాలు తెచ్చిన ప్రత్యేక 'మూరత్​ ట్రేడింగ్​'

దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్​లో స్టాక్​మార్కెట్లు​ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 192 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి ట్రేడింగ్ ముగించాయి. ఈ ప్రత్యేక ట్రేడింగ్​ను సినీ నటులు రాజ్​కుమార్​ రావ్​, మౌనీ రాయ్​లు ప్రారంభించారు.

మార్కెట్లకు లాభాలు తెచ్చిన ప్రత్యేక 'మూరత్​ ట్రేడింగ్​'

By

Published : Oct 27, 2019, 9:26 PM IST

దీపావళి సందర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు గంటపాటు జరిపిన ప్రత్యేక 'మూరత్​ ట్రేడింగ్'​లో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 192 పాయింట్లు లాభంతో 39వేల 250 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్ల వృద్ధితో 11వేల 627 వద్ద ట్రేడింగ్​ ముగించింది.
ఈ ప్రత్యేక ట్రేడింగ్​ను సినీ నటులు రాజ్​కుమార్​ రావ్​, మౌనీ రాయ్​లు ప్రారంభించారు.

సంవత్​ 2076లోకి ప్రవేశం

నేటి నుంచి స్టాక్​మార్కెట్లు సంవత్‌ 2076లోకి అడుగుపెట్టాయి. ప్రతి ఏటా దీపావళి రోజున ఈ ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్‌ను ఎక్స్ఛేంజీలు నిర్వహిస్తాయి. ఈ పురాతన సంప్రదాయాన్ని ప్రతి దీపావళి నాడు ఇవి పాటిస్తూ వస్తున్నాయి. సాధారణ రోజుల్లో జరిగే ట్రేడింగ్‌ సమయంలో కాకుండా.. మూరత్‌ ట్రేడింగ్‌ కోసం శుభఘడియలను ఎంపిక చేసి గంట పాటు ట్రేడింగ్‌ జరుపుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఈ ట్రేడింగ్‌ సంస్కృతి ప్రారంభమైంది. భారత స్టాక్‌ మార్కెట్లలో గత 60 ఏళ్లుగా మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details