తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు భారీ నష్టాలు- సెన్సెక్స్ 812 పాయింట్లు డౌన్ - సెన్సెక్స్ నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 812 పాయింట్లు కోల్పోయి.. 38 వేల మార్క్ ఎగువన స్థిరపడింది. 254 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 11,251 వద్ద ముగిసింది.

sensex
సెన్సెక్స్

By

Published : Sep 21, 2020, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలు నమోదు చేసిన సూచీలు.. అనంతరం తిరోగమన బాటపట్టాయి. సెన్సెక్స్ భారీ క్షీణతను నమోదు చేసింది. 812 పాయింట్లు కోల్పోయి.. 38,034 వద్ద ముగిసింది.

మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాలను మూటగట్టుకుంది. 254 పాయింట్ల నష్టంతో 11,251 వద్ద స్థిరపడింది.

కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ మినహా సెన్సెక్స్ షేర్లన్నీ నష్టాల్లోనే ట్రేడింగ్​ను ముగించాయి. ఇండస్​ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 8 శాతం కోల్పోయింది. భారతీ ఎయిర్​టెల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ షేర్లు 5 శాతానికిపైగా పతనమయ్యాయి.

సెప్టెంబర్ డెరివేటివ్స్ గడువు దగ్గర పడుతుండటం, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల అంచనాలు ఒడుదొడుకులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్కెట్లను ప్రభావితం చేసే దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు లేకపోవడం కూడా మార్కెట్ల స్పందనకు కారణమని విశ్లేషకుల అంచనా.

ABOUT THE AUTHOR

...view details