తెలంగాణ

telangana

46,150పైకి సెన్సెక్స్- ఐటీ, ఆటో షేర్ల జోరు

By

Published : Dec 23, 2020, 9:31 AM IST

Updated : Dec 23, 2020, 10:17 AM IST

stock markets
స్టాక్ మార్కెట్లు

10:04 December 23

13,500పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 46,157 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 13,519 వద్ద కొనసాగుతోంది.

ఐటీ, ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. విదేశీ మదుపరుల నుంచి వస్తున్న కొనుగోళ్ల మద్దతు కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది.

  • ఎం&ఎం, మారుతీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్​ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
  • ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్ 1.42 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 49.37 డాలర్ల వద్ద ఉంది

09:00 December 23

ఐటీ షేర్ల జోరుతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

ఐటీ షేర్ల జోరుతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 144 పాయింట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం 46,151 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల బాటలోనే పయనిస్తోంది. 34 పాయింట్లు పెరిగి.. 13,500 వద్ద కొనసాగుతోంది.

ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ఎమ్​, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Dec 23, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details