తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్​ షేర్ల జోరు- లాభాల్లో స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్​

Stocks live news
స్టాక్స్ లైవ్​ అప్​డేట్స్

By

Published : May 10, 2021, 9:31 AM IST

Updated : May 10, 2021, 10:59 AM IST

10:54 May 10

బ్యాంకింగ్​ షేర్ల జోరు..

స్టాక్​ మార్కెట్​లో బ్యాంకింగ్​, ఫార్మా, లోహ రంగ షేర్ల దూకుడు కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూలతలు తోడవడం వల్ల దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బీఎస్​ఈ సెన్సెక్స్​ 321 పాయింట్లు వృద్ధి చెంది 49,527 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 14,929 వద్ద ట్రేడ్​ అవుతోంది.

హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ ఇండ్​, ఎస్​బీఐ, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డి షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, రిలయన్స్​, ఇన్ఫీ, టెక్​ఎమ్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:17 May 10

14,900 పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 370 పాయింట్లకుపైగా పెరిగి 49,581 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 120 పాయింట్లకుపైగా లాభంతో 14,944 వద్ద కొనసాగుతోంది.

ఫార్మా, చమురు, విద్యుత్​, బ్యాంకింగ్ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. 

  • డాక్టర్​ రెడ్డీస్​, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్​ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : May 10, 2021, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details