తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- 14,500 పైకి నిఫ్టీ - నిఫ్టీ

Stocks opening
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

By

Published : Apr 13, 2021, 9:32 AM IST

Updated : Apr 13, 2021, 3:42 PM IST

15:40 April 13

సెన్సెక్స్ 661 ప్లస్​..

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 661 పాయింట్లు పెరిగి 48,544 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 14,505 వద్దకు చేరింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం, బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్ ఫినాన్స్, మరుతీ, యాక్సిస్​ బ్యాంక్, ఓఎన్​జీసీ భారీగా లాభాలను నమోదు చేశాయి.

టీసీఎస్​, డాక్టర్​ రెడ్డీస్​, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, ఇన్ఫోసిస్​ ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, హాంకాంగ్, సియోల్​ సూచీలు లాభాలను గడించాయి.

14:51 April 13

ఆర్థిక షేర్ల రికవరీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 580 పాయింట్లకుపైగా లాభంతో 48,466 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 170 పాయింట్లు పెరిగి.. 14,480 వద్ద కొనసాగుతోంది.

వాహన, ఆర్థిక షేర్లు ఇటీవలి నష్టాల నుంచి వేగంగా రికవరీ అవుతుండటం భారీ లాభాలకు కారణంగా తెలుస్తోంది. ఐటీ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • ఎం&ఎం, బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్ ఫినాన్స్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టీసీఎస్​, టెక్ మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్, హెచ్​సీఎల్​టెక్​, నెస్లే షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

12:38 April 13

48 వేలపైన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 160 పాయింట్ల లాభంతో 48,046 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 14,359 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఎం&ఎం (6 శాతం), బజాజ్​ ఫిన్​సర్వ్, ఓఎన్​జీసీ, మారుతీ, బజాజ్ ఫినాన్స్, పవర్​గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్​, టెక్ మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:55 April 13

టీసీఎస్​ 4 శాతం డౌన్..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా పెరిగి 48,058 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా లాభంతో 14,361 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక, వాహన షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఐటీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • ఎం&ఎం, బజాజ్ ఫిన్​సర్వ్, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టీసీఎస్​, ఇన్ఫోసిస్, టెక్​ మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:10 April 13

స్టాక్ మార్కెట్లు లైవ్​ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్ల రికార్డు నష్టాలకు (సోమవారం సెషన్​లో) మంగళవారం బ్రేక్​ పడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభంతో 48,084 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు పెరిగి 14,378 వద్ద కొనసాగుతోంది.

 ఆర్థిక షేర్లు తేరుకోవడం, ఫార్మా షేర్ల జోరు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఎం&ఎం, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్​, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​టెక్, డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Apr 13, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details