తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్ ఎఫెక్ట్​: సెన్సెక్స్​​ 788 పాయింట్లు పతనం - stock markets closing

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 788 పాయింట్లు కోల్పోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 234 పాయింట్లు క్షీణించి 12 వేల మార్కు దిగువన ముగిసింది. రూపాయి సైతం భారీగా పతనమైంది.

Sensex nosedives 788 pts on US-Iran standoff
ట్రంప్ ఎఫెక్ట్​: సెన్సెక్స్​​ 788 పాయింట్లు పతనం

By

Published : Jan 6, 2020, 4:57 PM IST

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 788 పాయింట్లు నష్టపోయి 40,677 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 234 పాయింట్లు పతనమై 11,993 పాయింట్ల వద్ద ముగిసింది.

అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న డొనాల్డ్ ట్రంప్​ హెచ్చరికల నేపథ్యంలోనే మార్కెట్లు కుదుపునకు లోనైనట్లు తెలుస్తోంది. ముడిచమురు ధర పెరుగుదలతో పాటు రూపాయి పతనం ప్రతికూల ప్రభావం చూపింది.

లాభాల్లోని షేర్లు

సెన్సెక్స్​లోని 30 షేర్లలో కేవలం రెండు(టైటాన్​, పవర్​గ్రిడ్​) మాత్రమే లాభాలతో ట్రేడింగ్​ను ముగించాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు

సెన్సెక్స్​లో బజాజ్ ఫైనాన్స్​ భారీగా నష్టపోయింది. నేటి ట్రేడింగ్​లో 4.63 శాతం క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్​తో పాటు ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్, మారుతీ, హెచ్​డీఎఫ్​సీ, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టం చవిచూశాయి.

ముడి చమురు

ముడిచమురు బ్యారెల్​ ధర దాదాపు 2 శాతం పెరిగి 69.81 అమెరికన్ డాలర్లకు చేరింది.

క్షీణించిన రూపాయి

రూపాయి సైతం భారీగా పతనమైంది. 24 పైసలు బలహీనపడి 72.04 అమెరికన్ డాలర్ల వద్ద ముగిసింది.

ఆసియా మార్కెట్లు

ఇరాన్-అమెరికా ఉద్రిక్త పరిస్థితులు ఆసియా మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపించాయి. షాంఘై, హంకాంగ్, టోక్యో, సియోల్​ మార్కెట్లు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details