తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రంప్​ అభిశంసన ఎఫెక్ట్​.. ఒడుదొడుకుల్లో మార్కెట్లు - సెన్సెక్స్​

అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన క్రమంలో దేశీయ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 52 పాయింట్లు కోల్పోయి 41,506 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించింది.

Sensex
స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 19, 2019, 10:16 AM IST

స్టాక్​ మార్కెట్ల వరుస లాభాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభిశంసన తీర్మానం ఆమోదంతో బ్రేక్​ పడింది. విదేశీ మదుపరుల అప్రమత్తత, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఇవాళ ఆరంభ ట్రేడింగ్​లో మరోమారు రికార్డు స్థాయి 41,533 పాయింట్లకు చేరుకుంది. కానీ కొద్ది సమయానికే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 52 పాయింట్ల నష్టంతో.. 41,506 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ- 20 పాయింట్లు కోల్పోయి 12,201 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఎస్​ బ్యాంకు భారీగా నష్టపోయింది. సుమారు 2.46 శాతం మేర నష్టాల్లో కొనసాగుతోంది. ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, టాటా స్టీల్​, భారతీ ఎయిర్​టెల్ ఆరంభ ట్రేడింగ్​లో డీలా పడ్డాయి.

ఎం&ఎం సుమారు 1.26 శాతం లాభపడింది. హెచ్​సీఎల్​ టెక్​, టాటా మోటర్స్​, ఏషియన్​ పెయింట్స్​, టీసీఎస్​, హెచ్​యూఎల్ రాణించాయి.

రూపాయి..

రూపాయి స్వల్పంగా 5 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే ప్రస్తుతం మారకం విలువ రూ. 71.02 వద్ద ఉంది.

ఇదీ చూడండి: జీఎస్​టీ 38వ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details