తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆసాంతం ఊగిసలాట- చివరకు ఫ్లాట్​గా ముగిసిన సూచీలు - నేటి స్టాక్ మార్కెట్లు

గురువారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా(stock market news) ముగిశాయి. సెన్సెక్స్​ 5 పాయింట్ల లాభంతో 55,949 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2 పాయింట్లు బలపడి 16,637 వద్దకు చేరింది.

stock market news
స్టాక్ మార్కెట్​ వార్తలు

By

Published : Aug 26, 2021, 3:44 PM IST

స్టాక్​ మార్కెట్లు (stock market news)గురువారం ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(sensex today) 5 పాయింట్లు పెరిగి 55,949 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ(nifty today) 2 పాయింట్లను పుంజుకొని 16,637కు చేరింది. ఒకానొక దశలో సెన్సెక్స్​ 56 వేల మార్కును చేరింది.

ఆగస్టు కాంట్రాక్ట్​ల ముగింపు నేపథ్యంలో.. మదుపరులు ఆచితూచి అడుగులు వేశారు. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలతలు ఇందుకు తోడయ్యాయి. దీంతో సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 56,112 పాయింట్ల అత్యధిక స్థాయిని, 55,854 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 16,684 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,603 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి షేర్లు..

రిలయన్స్​, మహీంద్ర అండ్​ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, నెస్లే షేర్లు లాభాలను గడించాయి.

భారతీ ఎయిర్​టెల్​, మారుతి, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ, డాక్టర్​ రెడ్డీస్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ABOUT THE AUTHOR

...view details