తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కరోనా భయాలే కారణం!

దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ, ఎన్​ఎస్​ఈలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 38, 576వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 10 పాయింట్ల క్షీణతతో 11,293గా ట్రేడవుతోంది.

stocks
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కరోనా భయాలే కారణం!

By

Published : Mar 4, 2020, 10:10 AM IST

కరోనా కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందన్న అంచనాలతో మదుపరుల్లో నెలకొన్న ఊగిసలాట కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం లాభాలతో ముగిసిన సూచీలు నేటి మార్కెట్ ప్రారంభంలో సానుకూలంగా కదలాడాయి. అయితే.. అంతలోనే నష్టాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 38,576 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 10 పాయింట్ల క్షీణతతో 11,293 గా ఉంది.

లాభ, నష్టాల్లో..

ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ షేర్లు లాభాల్లో ఉండగా.. బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్​టెల్, హెచ్​సీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ..

డాలరు మారకం ధరతో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు బలపడి 72.95 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు

బ్రెంట్ ముడి చమురు విలువ 1.45 శాతం పెరిగి 52.61 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details