Stock Market Today India: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్లను పరుగులు పెట్టించాయి. దీంతో స్టాక్మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా ఆర్థిక షేర్లు లాభపడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1016 పాయింట్లు లాభంతో 58,649 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో.. 58,158 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ లాభాల్లో కొనసాగింది. తొలుత 58,122 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పుంజుకుని 58,702 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 239 పాయింట్ల వృద్ధితో 17,470 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో.. 17,315 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒకనొక దశలో 17,309 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. తిరిగి పుంజుకొని 17,485 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది.