తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- 17,300 పైకి నిఫ్టీ - షేర్ మార్కెట్ న్యూస్​ తెలుగు

stocks Live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Sep 3, 2021, 9:21 AM IST

Updated : Sep 3, 2021, 3:41 PM IST

15:39 September 03

స్టాక్ మార్కెట్లు శుక్రవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ 277 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 58,130వద్ద స్థిరపడింది. నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో తొలిసారి 17,323 వద్ద ముగిసింది.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​, బజాజ్ ఆటో, టాటా స్టీల్​, మారుతీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • భారతీ ఎయిర్​టెల్​, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి.

13:20 September 03

స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాళ్లోకి మళ్లాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల లాభంతో 58,049 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ 60 పాయింట్లకుపైగా పెరిగి.. 17,300 మార్క్​ దాటింది.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​, టాటా స్టీల్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, యాక్సిస్​ బ్యాంక్​, పవర్​గ్రిడ్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:35 September 03

స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ఠాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. సెన్సెక్స్ 60 పాయింట్లకుపైగా కోల్పోయి 57,772 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17,230 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​, ఏషియన్​ పెయింట్స్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​యూఎల్​, యాక్సిస్​ బ్యాంక్​, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

09:08 September 03

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు (Stock Market today) వారాంతంలో లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 250 పాయింట్లకుపైగా లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 58,108 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 50 పాయింట్లు పెరిగి కొత్త గరిష్ఠమైన 17,282వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, ఏషియన్​ పెయింట్స్​, డాక్టర్​ రెడ్డీస్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్​, టెక్ మహీంద్రా, టీసీఎస్​, మారుతీ సుజుకీ, హెచ్​డీఎఫ్​సీ నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
Last Updated : Sep 3, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details