తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు - news on stock market in india

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​.. 4 పాయింట్లు లాభంతో 40,327 వద్ద ట్రేడవుతోంది. 5 పాయింట్లు నష్టంతో నిఫ్టీ 11,902 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

By

Published : Nov 11, 2019, 10:05 AM IST

గతవారం చివర్లో జీవనకాల గరిష్ఠాన్ని తాకి.. చివరి క్షణాల్లో నష్టాల్లోకి జారుకున్న స్టాక్​ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్​ 4 పాయింట్ల లాభంతో 40,327 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 5 పాయింట్ల క్షీణతతో 11, 902 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఎస్​ బ్యాంక్​, జీ ఎంటర్​టైన్​మెంట్స్​, టాటా మోటర్స్​, ఎం అండ్​ ఎం, ఐఓసీ సుమారు 1 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.

సన్​ఫార్మా, గ్రసిమ్​, భారతీ ఎయిర్​టెల్​, సిప్లా, హెచ్​సీఎల్​​ టెక్​ సుమారు 1.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. 8 పైసలు నష్టపోయింది. ప్రస్తుతం రూ.71.34 వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి:ద్రవ్యోల్బణం గణాంకాలే ఈ వారం మార్కెట్లకు కీలకం

ABOUT THE AUTHOR

...view details