తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ పెట్టుబడుల రాకతో స్వల్ప లాభాలు - స్టాక్​మార్కెట్

స్టాక్​మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. విదేశీ పెట్టుబడుల రాక కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లు జరపడమే ఇందుకు కారణం.

విదేశీ పెట్టుబడుల రాకతో స్వల్ప లాభాలు

By

Published : Apr 25, 2019, 10:28 AM IST

స్టాక్​మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లో స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 50పాయింట్లకుపైగా పెరిగి 39వేల 110 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 30పాయింట్ల లాభంతో 11వేల 750 వద్ద ట్రేడవుతోంది.

విదేశీ పెట్టుబడుల రాక కొనసాగడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. అయితే.. ఏప్రిల్​ డెరివేటివ్​ల కాంట్రాక్టు ముగింపునకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండగా... లాభాలు పరిమితంగా ఉన్నాయి.

లాభాల్లో...

ఎస్​ బ్యాంకు, పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్ టీ, హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ డ్యుయో, ఎన్​టీపీసీ, సన్​ ఫార్మా, ఇండస్​ఇండ్​ బ్యాంకు, ఐటీసీ, హెచ్​యూఎల్​, బజాజ్​ ఫైనాన్స్​ (సుమారు 2.78 శాతం) లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో...

మారుతీ, ఓఎన్​జీసీ, బజాజ్​ ఆటో, ఏసియన్​ పెయింట్స్, ఇన్ఫోసిస్​, హీరో మోటోకార్ప్​, టీసీఎస్​, వేదాంత, కోటక్​ బ్యాంకు, ఆర్​ఐఎల్​ (సుమారు 0.83 శాతం) నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లైన షాంగై, టోక్యో, సియోల్​ ఈక్విటీ సూచీలు మిశ్రమ ఫలితాలను చూశాయి. వాల్​స్ట్రీట్​, డౌ​జోన్స్​ ఇండస్ట్రియల్ బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.

ముడిచమురు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 0.03 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 74.59 అమెరికన్ డాలర్లుగా ఉంది.

క్షీణించిన రూపాయి విలువ

రూపాయి విలువ 17 పైసలు క్షీణించింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్​కు రూ.70.04 లుగా ఉంది.

ఇదీ చూడండి: ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌లు ఇక ప్రభుత్వానిదే!

ABOUT THE AUTHOR

...view details