స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 403 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 55,959వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో తొలిసారి 16,625 వద్ద ముగిసింది.
- బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాలను గడించాయి.
- నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.