తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 214 డౌన్​ - షేర్ మార్కెట్ న్యూస్​ తెలుగు

stocks LIve
స్టాక్స్​ లైవ్

By

Published : Sep 1, 2021, 9:27 AM IST

Updated : Sep 1, 2021, 3:40 PM IST

15:36 September 01

ఆరంభంలో లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు కోల్పోయి 57,338 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 56 పాయింట్లు తగ్గి 17,076 వద్ద ముగిసింది.

  • ఏషియన్ పెయింట్స్​, నెస్లే, యాక్సిస్​ బ్యాంక్​, టైటాన్​, డాక్టర్​ రెడ్డీస్​ లాభాలను గడించాయి.
  • ఎం&ఎం, టాటా స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

13:25 September 01

లాభాల స్వీకరణ..

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా కోల్పోయి 57,441 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా తగ్గి.. 17,099 వద్ద కొనసాగుతోంది.

  • ఏషియన్​ పెయింట్స్, యాక్సిస్​ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​, టైటాన్​, ఎల్​&టీ లాభాల్లో ఉన్నాయి.
  • ఎం&ఎం, టెటా స్టీల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హెచ్​డీఎఫ్​సీ, అల్ట్రాటెక్​ సిమెంట్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:36 September 01

స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా తగ్గి 57,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా నష్టంతో 17,110 వద్ద కొనసాగుతోంది.

వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. లోహ, ఫినాన్స్​, వాహన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • ఏషియన్​ పెయింట్స్​, యాక్సిస్​ బ్యాంక్​, నెస్లే ఇండియా, ఎల్​&టీ, డాక్టర్​ రెడ్డీస్​ లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్​, బజాజ్ ఫిన్​సర్వ్​, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:03 September 01

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు (Stock Market today) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 70 పాయింట్లకుపైగా లాభంతో 57,627 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 40 పాయింట్లకుపైగా పెరిగి 17,172 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. 

వరుస లాభాల జోరు.. దేశ జీడీపీ గణాంకాల సానుకూలతలు సూచీలను ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

  • యాక్సిస్​ బ్యాంక్, బజాజ్ ఆటో, ఏషియన్​ పెయింట్స్, ఎల్​&టీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్​, మారుతీ, భారతీ ఎయిర్​టెల్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Sep 1, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details