తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫీ భయం- నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు - sensex news

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు, విదేశీ నిధుల ఉపసంహరణతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. 65 పాయింట్ల నష్టంతో 38,896 వద్ద సెన్సెక్స్​, 22 పాయింట్లు కోల్పోయి 11,569 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Oct 23, 2019, 10:01 AM IST

Updated : Oct 23, 2019, 10:09 AM IST

ఇన్ఫోసిస్​ షేర్ల పతనంతో మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు.. బుధవారం ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాలు, విదేశీ నిధుల ఉపసంహరణకు తోడు ఇన్ఫోసిస్​ భయాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 65 పాయింట్ల నష్టంతో 38,896 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 11,569 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

హెచ్​సీఎల్​ టెక్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, సన్​ ఫార్మా, టీసీఎస్​, టేక్​ మహీంద్ర, యాక్సిస్​ బ్యాంక్​, రిలయన్స్​, బ్రిటానియా లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎస్​ బ్యాంక్​, అదాని పోర్ట్​, టాటా మోటర్స్​, జీ ఎంటర్​టైన్​మెంట్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, హెచ్​యూఎల్​, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, ఎల్​అండ్​టీ సుమారు 2.5 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 4 పైసలు లాభపడి రూ.70.98 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Oct 23, 2019, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details