స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. ఐటీ రంగ షేర్లు(Stocks in news) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధరలు తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 153 పాయింట్లు పెరిగి.. 57,261 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ (nifty today) 28 పాయింట్ల లాభంతో 17,054 వద్ద సెషన్‌ను(Stock market news) ముగించింది.
ఇంట్రాడేలో ఇలా..
- బీఎస్ఈ సెన్సెక్స్ 57,627 పాయింట్ల గరిష్ఠాన్ని.. 56,382 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
- ఎన్ఎస్ఈ నిఫ్టీ17,161 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 16,782 పాయింట్ల అత్యల్ప స్థాయి మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
- కోటక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు (Stocks in news) రాణించాయి.
- ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, నెస్లే, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.