వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డులు సృష్టించాయి. గురువారం సెషన్లో బీఎస్ఈ సూచీ-సెన్సెక్స్ 358 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 50,614 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 14,895 వద్దకు చేరింది.
బడ్జెట్ ఇచ్చిన జోష్ లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,687 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 49,926 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,913 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 14,714 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.