దేశీయ మిశ్రమ పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్తబ్దుగా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి 39,058 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.3 పాయింట్లు మెరుగై 11,583 వద్ద స్థిరపడింది.
ఒకానొక దశలో భారీగా నష్టపోయిన సూచీలు బ్యాంకింగ్ రంగం వృద్ధితో గట్టెక్కాయి. సెన్సెక్స్ 573 పాయింట్ల మేర పడిపోయి 38,718కు చేరుకుంది.
లాభనష్టాల్లో..
ఎస్ బ్యాంక్, ఎస్బీఐ 7 శాతానికిపైగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ 3.18 శాతం పెరిగాయి.
టాటా మోటార్స్, వేదాంత, హెచ్డీఎఫ్సీ కొటక్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, ఎన్టీపీసీ 4.87 శాతం మేర నష్టపోయాయి.
ఆసియాలో మిశ్రమ ఫలితాలు నమోదవగా.. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.