Share Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మంగళవారం సెషన్‌ను తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభించిన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ 221 పాయింట్లు పెరిగి 60,617 వద్ద సెషన్‌ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 18,055 వద్ద స్థిరపడింది.
త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న ఆశల మధ్య ఆర్థిక, ఐటీ రంగాల జోరు కొనసాగింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 60,689 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,281 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 18,081 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,964 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.