సోమవారం సెషన్లో సూచీలు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 145 పాయింట్లు పెరిగి 55,582వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద ముగిసింది.
డెల్టా వేరియంట్ భయాలు, అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వం కూలడం లాంటి అంశాలు అంతర్జాతీయంగా ఆందోళనలు కలిగించినా.. దేశీయ సూచీలు లాభాలు గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 55,487 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 55,281 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,585 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,480 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్,బజాజ్ ఫినాన్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ,హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.
మారుతీ, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, టెక్ మహీంద్ర, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చదవండి:పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఇవన్నీ అపోహలే!