తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో నష్టాలు

స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా విపణుల నుంచి బలహీన సంకేతాలు వెలువడడం సహా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Jul 29, 2019, 10:13 AM IST

స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 80 పాయింట్లు తగ్గి 37వేల 800 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11 వేల 245 వద్ద ట్రేడవుతోంది.

ఇవీ కారణాలు...

ఆసియా విపణులు నష్టాల్లో ప్రారంభం కావడం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నష్టాలకు మరో కారణం.

లాభనష్టాల్లో...

ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ మహీంద్రా, టీసీఎస్​, ఇన్ఫోసిస్, ఇండస్​ ఇండ్ బ్యాంక్​, కోటక్ బ్యాంక్​, హెచ్​యూఎల్​, యాక్సిస్ బ్యాంక్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఎం అండ్​ ఎం, టాటా మోటర్స్​, ఎస్​బీఐ, యెస్​ బ్యాంక్, టాటా స్టీల్​, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి... ముడి చమురు...

రూపాయి విలువ 4 పైసలు తగ్గి డాలరుతో పోల్చితే రూ. 68.93గా ఉంది.

ముడి చమురు ధరల సూచీ- బ్రెంట్​ 0.32శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 63.26 డాలర్లుగా ఉంది

ABOUT THE AUTHOR

...view details