స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలను నమోదు చేశాయి. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 525 పాయింట్లు తగ్గి 58,490వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 188 పాయింట్ల నష్టంతో 17,396 వద్దకు చేరింది.
మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. లోహ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా సూచీలు ఈ స్థాయి నష్టాలను మూటగట్టుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,202 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,469 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,622 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,389 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.